ఏపీ కానిస్టేబుల్‌కు సన్నద్ధమిలా

Huge no of Companies Conducting Interviews Through Amcat Test
Register With Your Details for Top MNC's Direct Interviews.
HDFC Off-Campus Drives with 3,00,000 Lac Salary
రాష్ట్రం విడిపోయిన తరవాత వెలువడిన మొదటి పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇది. ‘పోలీస్‌ శాఖ’ - శాంతి భద్రతలను కాపాడే కీలకమైన సామాజిక బాధ్యతతో విధులను నిర్వహించే విభాగం. అలాంటి శాఖలో అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, వీధి చివరి గస్తీ నుంచి విఐపీల భద్రత వరకు ఎంతో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించే కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగ సాధనలో ఎలా ప్రిపేర్‌ కావాలి, విజయం సాధించడానికి పాటించాల్సిన మెలకువలు తదితర అంశాలపై విశ్లేషణ...

పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంపిక ప్రక్రియ 3 దశలుగా ఉంటుంది. 

1. ప్రిలిమినరీ పరీక్ష 2. శారీరక సామర్థ్య పరీక్ష 
3. అంతిమ (ఫైనల్‌) పరీక్ష 
ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలి. ఇందులో క్వాలిఫై అయినవారికి ఫైనల్‌ ఎగ్జామ్‌ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయినవారి నుంచి మెరిట్‌ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వచ్చి ఉంటే వయసు ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇస్తారు. 
కనీస విద్యార్హతలు 
1. ఇంటర్‌మీడియెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 
2. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్‌మీడియెట్‌ రెండు సంవత్సరాలు పరీక్షకు హాజరైతే సరిపోతుంది. 
3. హోంగార్డ్స్‌/ ఎన్‌సిసి/ ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ఫోర్స్‌ అభ్యర్థులు - 18 - 30 సంవత్సరాలు 
4. డైవోర్సీ/ విడో మహిళలు : 18 - 40 సంవత్సరాలు (ఎస్సీ/ ఎస్టీ), 
18-35 సంవత్సరాలు (ఇతరులు) 
గమనిక: వయసు సడలింపు కలిపి ఇచ్చారు. 
ఉద్యోగాల సంఖ్య: 4548 
1. పోలీస్‌ కానిస్టేబుల్‌ (సివిల్‌) (స్త్రీలు/ పురుషులు) - 3216 
2. పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఏఆర్‌) (స్త్రీలు/ పురుషులు) - 1067 
3. వార్డర్స్‌ (ఏఆర్‌) (పురుషులు) - 240 
4. వార్డర్స్‌ (ఏఆర్‌) (స్త్రీలు) - 25 
మొత్తం - 4548 
శారీరక ప్రమాణాలు 
కానిస్టేబుల్స్‌ (సివిల్‌ & ఏఆర్‌) 
జనరల్‌ అభ్యర్థులు - ఏజెన్సీ అభ్యర్థులు :
1. పురుషులు ఎత్తు : 167.6 సెం.మీ.  - ఎత్తు : 160 సెం.మీ. 
ఛాతీ : 86.3 సెం.మీ. -  ఛాతీ : 80 సెం.మీ. 
ఊపిరి పీల్చినప్పుడు
50 సెం.మీ. పెరగాలి - 30 సెం.మీ. పెరగాలి 
2. స్త్రీలు ఎత్తు : 152.5 సెం.మీ. -  ఎత్తు : 150 సెం.మీ. 
బరువు : 40 కిలోలు 
జనరల్‌ అభ్యర్థులు - ఏజెన్సీ అభ్యర్థులు :
1. పురుషులు ఎత్తు : 168 సెం.మీ. -  ఎత్తు : 164 సెం.మీ 
ఛాతీ : 87 సెం.మీ. -  ఛాతీ : 83 సెం.మీ. 
ఊపిరి పీల్చినప్పుడు 
50 సెం.మీ. పెరగాలి -  50 సెం.మీ. పెరగాలి 
2. స్త్రీలు ఎత్తు : 153 సెం.మీ --- 
బరువు : 45.5 కిలోలు 
గమనిక: కనిష్ఠ శారీరక ప్రమాణాలు ఇచ్చారు. 
+ కంటి పరీక్ష: పోలీసు అభ్యర్థులకు కంటిచూపు సరిగ్గా ఉండాలి. గుడ్డి, మెల్లకన్ను లాంటి లోపాలున్న అభ్యర్థులు ఉద్యోగాలకు అనర్హులు. 
కుడి కన్ను -  ఎడమ కన్ను 
1. దీర్ఘదృష్టి 6/6  -  6/6 
2. హ్రస్వదృష్టి 0/5 -  0/5 
గమనిక: దృష్టి లోపంతోపాటు ఇంతర శారీరక లోపాలు ఏమున్నా అలాంటి అభ్యర్థులు మెడికల్‌ టెస్ట్‌లో ఫెయిల్‌ అవుతారు. ఉద్యోగాలకు అనర్హులవుతారు. 

+  ప్రిలిమినరీ పరీక్ష: అందరు అభ్యర్థులకు కామన్‌గా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 200 మార్కులకు, 200 ప్రశ్నలతో (సమయం 3 గంటలు) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈవెంట్స్‌కు అంటే దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలి. ఈ ప్రిలిమ్స్‌ పరీక్షలో ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు 40% , బిసి అభ్యర్థులు 35%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30%  మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు. 

+ శారీరక సామర్థ్య పరీక్ష: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ను మూడు విభాగాల్లో పరీక్షిస్తారు. 
క్వాలిఫయింగ్‌ సమయం/ దూరం 
నం. అంశం/ విభాగం -  జనరల్‌ - ఎక్స్‌. సర్వీస్‌మన్‌ - స్త్రీలు 
1. 100 మీటర్ల పరుగు  - 15 సెకన్లు  - 16.5 సెకన్లు -  18 సెకన్లు 
2. లాంగ్‌ జంప్‌ - 3.8 మీటర్లు - 3.65 మీటర్లు - 2.75 మీటర్లు 
3. 1600 మీ. పరుగు - 8 నిమిషాలు -  9 ని. 30 సెకన్లు - 10 ని. 30 సెకన్లు 

+  ఫైనల్‌ ఎగ్జామ్‌: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫైనల్‌ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ అంతిమ పరీక్ష కానిస్టేబుల్స్‌ (సివిల్‌), వార్డర్స్‌ (పురుషులు), వార్డర్స్‌ (సీ్త్రలు) లకు ఒకే పేపర్‌ ఉంటుంది. 3 గంటల కాలవ్యవధిలో 200 మార్కులకు నిర్వహిస్తారు. కానిస్టేబుల్స్‌ (ఏఆర్‌)కు మాత్రం 100 మార్కులకు (200 ప్రశ్నలకు) 3 గంటల కాలవ్యవ ధితో అంతిమ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఓసీలు 40ు, బిసిలు 35ు, ఎస్సీ, ఎస్టీలు 30ు మార్కులు సాధిస్తే క్వాలిఫై అవుతారు. కానీ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్‌ చేస్తారు. ఇదే అంతిమ ఘట్టం. 
ఫీజు :
ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ/ ఎస్టీలకు రూ.150. ఏపీ ఆన్‌లైన్‌ లేదా మీసేవ/ టిఎస్‌ ఆన్‌లైన్‌ సెంటర్లలో ఫీజు చెల్లించవచ్చు. 
ముఖ్యమైన తేదీలు 
1. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 03-08-2016 
2. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 14-09-2016 
3. ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 16-10-2016 (ఆదివారం) (ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు) 
4. హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి 10 రోజుల ముందు ననుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
వెబ్‌సైట్‌: 
recruitment.appolice.gov.in

చదవాల్సిన పుస్తకాలు 
1. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌ 
2. క్విక్‌ అర్థమెటిక్‌ - ఆశిష్‌ అగర్వాల్‌ 
3. వెర్బల్‌ ్క్ష నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌ - ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌ 
4. రీజనింగ్‌ (తెలుగు) - పుష్పాల శివాజీ 
5. ఆరు నుంచి పదో తరగతి గణితం, సైన్స్‌, సోషల్‌ పుస్తకాలు 
6. తెలుగు అకాడమీ బుక్స్‌ (జనరల్‌ స్టడీస్‌ కోసం) 

సిలబస్‌ :
ప్రిలిమినరీ, ఫైనల్‌ పరీక్షలకు ఒకే సిలబస్‌ ఉంటుంది. ఫిజికల్‌ ఈవెంట్ల తరవాత ఫైనల్‌ ఎగ్జామ్‌ ఉంటుంది. మొత్తం 200 మార్కులకు ఉండే ఈ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ స్టడీస్‌ నుంచి 100 ప్రశ్నలు, ఇంగ్లీషు నుంచి 30 ప్రశ్నలు, అర్థమెటిక్‌- రీజనింగ్‌లనుంచి 70 ప్రశ్నలు వస్తాయి. వీటికి 3 గంటల్లో సమాధానాలు గుర్తించాలి. 
ప్రధాన విభాగాలు: రాత పరీక్షలో ప్రధానంగా ఏడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి 
1. జనరల్‌ ఇంగ్లీష్‌ 
2. అర్థమెటిక్‌ 
3. జనరల్‌ సైన్స్‌ 
4. భారతదేశ చరిత్ర - సంస్కృతి- జాతీయోద్యమం 
4. ఇండియన్‌ జాగ్రఫీ - పాలిటీ - ఎకానమీ 
6. కరెంట్‌ ఈవెంట్స్‌ 
7. రీజనింగ్‌ / మెంటల్‌ ఎబిలిటీ 
ప్రశ్నల క్లిష్టత ఇంటర్‌మీడియెట్‌ స్థాయిలో ఉంటుంది. ఈ ఏడు ప్రధాన విభాగాల్లోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... 
జనరల్‌ ఇంగ్లీష్‌: ఇందులో అడిగే ప్రశ్నలు హైస్కూల్‌ స్థాయిలో ఉంటాయి. సినానిమ్స్‌, ఆర్టికల్స్‌, ప్రిపొజిషన్స్‌, స్పెల్లింగ్‌ టెస్ట్‌, టెన్సెస్‌, వాయిస్‌, కాంప్రహెన్షన్‌ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. 
అర్థమెటిక్‌: ఈ విభాగంలో అభ్యర్థి తార్కిక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. డేటా సఫిషియెన్సీ, అసర్షన్‌-రీజన్‌ ప్రశ్నలకూ అవకాశం ఉంది. ఆర్థమెటిక్‌లో దృష్టి సారించాల్సిన టాపిక్స్‌... క.సా.గు., గ.సా.భా., సంఖ్యలపై లెక్కలు, సూక్ష్మీకరణాలు, వర్గం- వర్గమూలం, ఘనం- ఘనమూలం, సరాసరి, నిష్పత్తి- అనుపాతం, శాతాలు, లాభనష్టాలు, డిస్కౌంట్‌, భాగస్వామ్యం, కాలం- పని, కాలం- దూరం, పైపులు - ట్యాంకులు, వడ్డీ లెక్కలు, రైళ్ళు, వయసులు, గడియారాలు, క్యాలెండర్‌, వైశాల్యాలు, ఘనపరిమాణాలు, ప్రస్తారాలు - సంయోగాలు, సంభావ్యత వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. మిగతా విభాగాలతో పోల్చుకుంటే ఇందులో సమాధానాలు గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరం కాబట్టి షార్ట్‌కట్స్‌, ఎక్కాలు, వర్గాలు, ఘనాల మీద మంచి పట్టు ఉండాలి. ఎక్కువసార్లు సాధన చేయడం ద్వారా సమస్య పరిష్కారంలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. 
జనరల్‌ సైన్స్‌: ఇందులో జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, ఫిజిక్స్‌, కెమిసీ్ట్ర ఇలా... నాలుగు భాగాల నుంచి ప్రశ్నలు అడగవచ్చు. ఈ క్రమంలో జీవరాశులు, విటమిన్లు, వాతావరణం, శాస్త్రవేత్తలు- ఆవిష్కరణలు, రసాయనాలు- ఫార్ములాలు, వ్యాధులు, భారత అంతరిక్ష కార్యక్రమాలు, మానవ శరీరం, హృదయం, శ్వాసక్రియ, జీర్ణక్రియ, మొక్కలు, విద్యుత్‌, అయస్కాంతం, ధ్వని, కాంతి వంటి అంశాలపై అధిక శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 
+ భారతదేశ చరిత్ర - సంస్కృతి- జాతీయోద్యమం: ఈ విభాగాన్ని పరిశీలిస్తే, భారతదేశ చరిత్రలో మూడు ప్రధాన విభాగాలున్నాయి. అవి ప్రాచీన యుగం, మధ్య యుగం, ఆధునిక చరిత్ర. ఈ క్రమంలో హరప్పా నాగరికత నుంచి వేదయుగం, మౌర్యులు, శాతవాహనులు, కాకతీయులు, గుప్తుల కాలంనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మొఘల్‌ సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు, విజయనగర రాజులు, సిపాయిల తిరుగుబాటు, ఆంగ్లేయుల పాలన, భారత జాతీయోద్యమం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఏపీ చరిత్ర కూడా ఇండియన్‌ హిస్టరీలో భాగం. కనుక ఏపీ హిస్టరీపైనా దృష్టి సారించాలి. అంతేకాకుండా హిస్టరీలోని ప్రశ్నలను అసర్షన్‌-రీజన్‌ రీతిలో కూడా అడగవచ్చు. కనుక ఆ విధానంలో కూడా ప్రిపరేషన్‌ కొనసాగించండి. 
+ ఇండియన్‌ జాగ్రఫీ - పాలిటీ- ఎకానమీ: ఈ విభాగంలో జాగ్రఫీ నుంచి నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, నదులు, ఖనిజాలు, అడవులు, వ్యవసాయం, పర్వతాలు, సముద్రాలు, రవాణా సౌకర్యాలు, నీటిపారుదల వ్యవస్థ, జాతీయ ఉద్యానవనాలు సంబంధిత అంశాలను ఎక్కువగా చదవాలి. పాలిటీ విషయానికి వస్తే భారత రాజ్యాంగం, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రపతి- ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్‌ (లోక్‌సభ, రాజ్యసభ), సుప్రీంకోర్టు, హైకోర్టులు, కాగ్‌ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఎకానమీలో భారత్‌, ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థలు, బడ్జెట్‌, జనాభా, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు, బ్యాంకులు, పన్నులు, ఎగుమతులు- దిగుమతులు లాంటి అంశాలు, రాష్ట్రప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన అంశాలపై దృష్టి సారించాలి. 
+ కరెంట్‌ ఈవెంట్స్‌: జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న సంఘటనలపై దృష్టి సారించాలి. అంతేకాకుండా వార్తల్లో వ్యక్తులు, సదస్సులు, ఒప్పందాలు, కమిటీలు-అధ్యక్షులు, ఎన్నికలు, ఐక్యరాజ్య సమితి, క్రీడలు, ముఖ్యమైన తేదీలు, శాస్త్రపరిశోధనలు, జనాభా లెక్కలు, అవార్డులు వంటి అంశాలు చదవాలి. అలాగే జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి మొదటివి, చిన్నవి, పొడవైనవి, ప్రథమ వ్యక్తులు, నూతన దేశాలు, ప్రాంతాల పేర్లు మొదలైనవి చదవాలి. డైలీ పేపర్‌ చదవడం వల్ల కరెంట్‌ ఈవెంట్స్‌పై పట్టు సాధించవచ్చు. 
+ రీజనింగ్‌/ మెంటల్‌ ఎబిలిటీ: ఈ విభాగంలో ప్రశ్నలు అభ్యర్థి విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షించేవిగా ఉంటాయి. ఇందులో కోడింగ్‌- డీకోడింగ్‌, అనాలజీ, దిశలు, సిరీస్‌, రక్తసంబంధాలు, ర్యాంకింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, నాన్‌ వెర్బల్‌ నుంచి సిరీస్‌, అనాలజీ, క్లాసిఫికేషన్స్‌, మిర్రర్‌/ వాటర్‌ ఇమేజెస్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టేట్‌మెంట్‌ బేస్డ్‌ ప్రశ్నలు, అసర్షన్‌- రీజన్‌, అంశాలపై కూడా ప్రశ్నలు రావచ్చు.
Sorce Link: Click Here
ఏపీ కానిస్టేబుల్‌కు సన్నద్ధమిలా ఏపీ కానిస్టేబుల్‌కు సన్నద్ధమిలా Reviewed by Unknown on 04:05:00 Rating: 5
Powered by Blogger.