నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ తీపికబురు

Huge no of Companies Conducting Interviews Through Amcat Test
Wipro , Tech Mahindra Hiring 2016 -Online Registration
APPSC

రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా 4 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచే సిన నేపథ్యంలో ఆగస్టులో వరుసగా నోటిఫికేషన్లు జారీచేయడానికి ఆసంస్థ ఏర్పాట్లు చేసింది. ఆగస్టు మొదటి వారంలో తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. సోమవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ అనేక అంశాలు వివరించారు.

‘ఏపీపీఎస్సీలోని గ్రూప్ 1, 2, 3లోని పోస్టులను ఆయా కేటగిరీల్లోనే పాత విధానంలోనే భర్తీచేస్తాం. పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీలోని రూల్ 6ను  అనుసరించారు. ఈ ప్రకారం మిగిలిపోయిన పోస్టులు తదుపరి నోటిఫికేషన్లోకి మళ్లించాలి. రూల్ 7 అందుకు భిన్నంగా  తదుపరి ఖాళీలను మెరిట్ జాబితాలో తదుపరి స్థానాల్లో ఉన్న వారితో భర్తీచేయాలని సూచిస్తోంది. రూల్7ను రద్దుచేయాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ఇక నుంచి రూల్6 ప్రకారమే  భర్తీ ఉంటుంది.’ అని ఆయన తెలిపారు.
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ తీపికబురు నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ తీపికబురు Reviewed by Ramesh Reddy on 04:26:00 Rating: 5
Powered by Blogger.