10,000 Vacancies in Public Service Commission (APPSC)

Huge no of Companies Conducting Interviews Through Amcat Test
Register With Your Details for Top MNC's Direct Interviews.
HDFC Off-Campus Drives with 3,00,000 Lac Salary
Direct Recruitment

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం పచ్చ జెండా వూపింది. 10 వేల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగ నియామకాలు చేసే ఏపీపీఎస్సీ, ఏపీ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులకు అనుమతులిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా 4,009 ఖాళీలు, పోలీస్‌ రిక్రూమెంట్‌ బోర్డు ద్వారా 5,991 ఖాళీల్ని భర్తీ చేస్తారు. గ్రూప్‌-1లో 94, గ్రూప్‌-2లో 750, గ్రూప్‌-3లో వెయ్యి పోస్టులను ప్రభుత్వం గుర్తించింది. అలాగే వైద్యఆర్యోగ విభాగంలో 422 ఖాళీలున్నాయి. వివిధ శాఖల్లోని సాంకేతిక సంబంధిత పోస్టులు వెయ్యి ఉన్నాయి. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా సివిల్‌ విభాగంలో ఎస్సైలు 287, మహిళ ఎస్సైలు 110, కానిస్టేబుళ్లు 1,103, మహిళ కానిస్టేబుళ్లు 60 భర్తీ కానున్నాయి. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు సబ్‌ డివిజన్‌తో కలుపుకొని గుంటూరు గ్రామీణ జిల్లా ఎస్పీ పరిధిలోని పోస్టుల్నీ ఎక్కువగానే గుర్తించారు. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసు విభాగాల్లోని ఖాళీలూ భారీగా భర్తీ కాబోతున్నాయి. నియామక బోర్డులు జోన్‌/జిల్లాలవారీగా ఖాళీలను గుర్తించడం, రోస్టర్‌ పాయింట్లు, అర్హతలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

10 వేల ఉద్యోగాల భర్తీ
రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా
ఏపీపీఎస్సీ ద్వారా 4,009 పోస్టులు
పోలీస్‌ రిక్రూమెంట్‌ బోర్డు ద్వారా 5,991
గ్రూప్‌-1లో 94, గ్రూప్‌-2లో 750
గ్రూప్‌-3లో 1,000 ఉద్యోగాలు
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ




10,000 Vacancies in Public Service Commission (APPSC) 10,000 Vacancies in Public Service Commission (APPSC) Reviewed by Unknown on 22:22:00 Rating: 5
Powered by Blogger.